Tuesday, 3 November 2026

అగస్టా కుంభకోణంలో బ్రదర్‌ అనిల్‌ హస్తం

ఎంపి సిఎం రమేశ్‌ సంచలన ఆరోపణ
కడప,మే4(జ‌నంసాక్షి): దేశంలో సంచనం సృష్టిస్తున్న అగస్టా కుంభకోణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ హస్తముందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని తాను పార్లమెంట్‌లో డిమాండ్‌ చేస్తానని రమేష్‌ చెప్పారు. అగస్టా స్కాం పై  ఎంపీ రమేష్‌ చేసిన తాజా ఆరోపణ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఇప్పటికే ఈ కుంభకోణంపై పార్లమెంటులో చర్చించేందుకు అధికారపార్టీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు.  అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలో హష్కీతో బ్రదర్‌ అనిల్‌కు సంబంధాలున్నాయని  సీఎం రమేష్‌ ఆరోపించారు. బుధవారం కడపలో ఆయన విూడియాతో

మాట్లాడుతూ.. 2012లోనే దీనిపై రాజ్యసభలో ప్రస్తావించినా.. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. బ్రదర్‌ అనిల్‌పై ఖమ్మం జిల్లాలో కేసు నమోదైందని తెలిపారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఇప్పటికే దీనిపై పార్లమెంటులో రగడ సాగుతోంది. మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిని మూడ్రోజులుగా విచారిస్తున్నారు. తాజాగా ఇప్పుడు బ్రదర్‌ అనిల్‌ పత్రాపపై విచారణ జరపాలి టిడిపి కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *