మీసేవ నిర్వాహకుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

మీసేవ నిర్వాహకుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
నర్సాపూర్. ఆగస్టు 25 జనం సాక్షి
మీసేవ నిర్వాహక న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని మీ సేవ నిర్వాకులు డిప్యూటీ తహసిల్దార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీసేవ నిర్వాహకులు ప్రసాద్, విజయ్ మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా కమిషన్ పెంచాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. గత పది సంవత్సరాల నుంచి మీసేవ నిర్వాహకులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు