గృహలక్ష్మి దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరించాలి.

వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా
హరితహారం ను పూర్తి చేయాలి ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి.

మిర్యాలగూడ, జనం సాక్షి.

గృహ లక్ష్మీ పథకానికి సంబంధించిన దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరించాలని మిర్యాలగూడ ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో
పంచాయతీ కార్యదర్శులకు వేరే పని చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం నకు నిజమైన అర్హులను గుర్తించాలని,పరిశీలన త్వరగా పూర్తి చేయాలన్నారు.వజ్రోత్సవం ముగింపు లో బాగంగా శనివారం కోటి మొక్కలు నాటే కార్యక్రమం నీ విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులను, ప్రభుత్వ అధికారులను, ప్రజలను భాగస్వామ్యం చేసి మండలంలో 26000 ల మొక్కలు నాటి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఓ. వీరారెడ్డి, సాంకేతిక నిపుణులు,పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు