ముంపు ప్రాంత భూములు పరిశీలించిన మానవ హక్కుల సంఘ నేతలు
మహదేవపూర్ అక్టోబర్ 30 ( జనంసాక్షి )
మహదేవపూర్ మండల కేంద్రంలో మానవ హక్కుల నేతలు మహదేవపూర్ మండల కేంద్రంలో ని ముంపు భూములను పరిశీలించారు. అన్నారం సండ్రుపల్లి .కాళేశ్వరం . పలుగుల . కుంట్లం . నాగపల్లి .దమేరకుంట .పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలపై అధ్యానం చేసారని పేర్కొన్నారు. కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని. ప్రతి సంవత్సరం రెండు సార్లు పంటలు వేసిన ప్రతిఫలం లేకుండా రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని అన్నారు. వరద తీవ్రత పోయిన మళ్ళీ పంట వేసుకుంటే .కెనాల్ వెంబడి మోటర్లు వేసుకుంటే ఇరిగేషన్ అధికారులు మా మోటర్లను తీసుకోని పోతున్నారని. మా నీరు తీసుకొని పోతున్న ప్రభుత్వం మాకు నీరు కూడా ఇస్తలేరాని సండ్రుపల్లి రైతులు వాపోతున్నారని మానవ హక్కుల సంఘ నేతలు వాపోయారు ఈ ప్రాంత వాసులకు ఎలాంటి ఉపయోగం లేదని .ప్రభుత్వ అధికారులు తప్పుడు లెక్కలు చూపించి ఈ ప్రాంత రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు .కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన వెయిల ఎకరాల రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘాల నేతలు డా. తిరుపతయ్య . సల్పాల రమేష్ సమ్మయ్య .ప్రజా సంఘాల నాయకులు బుర్రి శివరాజు అన్వర్ పలువురు నేతలు పాల్గొన్నారు




