Tuesday, 3 November 2026

ప్రేమించి పెళ్లి చేసుకున్న తేజశ్రీ కి అన్యాయం జరిగితే ఉద్యమిస్తాం *ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగేష్

ప్రేమించి పెళ్లి చేసుకున్న తేజశ్రీ కి అన్యాయం జరిగితే ఉద్యమిస్తాం *ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగేష్ ప్రధాన కార్యదర్శి శంకర్ తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 30:: ప్రేమించి పెళ్లి చేసుకుని పది రోజులు కాపురం చేసిన తర్వాత పరారైన యశ్వంత్ రెడ్డి కి బాధితురాలు తేజశ్రీ కి న్యాయం చేసి వారిద్దరి కాపురాన్ని నిలబెట్టాలని ఆమెకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగేష్ రాష్ట్ర మహాసభ ప్రధాన కార్యదర్శి శంకర్ లు హెచ్చరించారు మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన భాషా బోయిన తేజశ్రీని అదే గ్రామానికి చెందిన యశ్వంత్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని గత 15 రోజుల క్రితం పారిపోయి నాచారం దేవస్థానంలో పెళ్లి చేసుకుని తూప్రాల్లో కాపురం ఉంటున్నారని వారు తెలిపారు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని కాపురం ఉంటామని తూప్రాన్ పోలీస్ స్టేషన్లో తాము కాపురం చేస్తామని తేజశ్రీ యశ్వంత్ రెడ్డిలు ఒప్పంద పత్రం రాసిచ్చారని వారు తెలిపారు కొందరు రాజకీయ నాయకులు యశ్వంత్ రెడ్డిని పరారీ చేయించారని వారు ఆరోపించారు ఈ విషయంలో రెండు రోజుల్లో తేజస్వికి అన్యాయం జరిగితే తాము చలో మనోహరాబాద్ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారపోలీస్ శాఖ యశ్వంత్ రెడ్డి ని పిలిపించ నిర్లక్ష్యం వహించారని అన్నారు రెండు మూడు రోజుల్లో తేజశ్రీకి న్యాయం జరగకపోతే బుద్ధ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు తెలిపారు మొదటగా దండుపల్లి చౌరస్తా నుండి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది డిఎస్పీ గారిని సంప్రదించాలని తెలపడంతో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి పాదయాత్రగా మద్రాస్ సంగం ఆధ్వర్యంలో తూప్రాన్ డిఎస్పి కార్యాలయానికి వచ్చారు డిఎస్పి సీఐ ఎవరు అందుబాటులో ఉండకపోవడంతో ఎస్ఐ యాదగిరి రెడ్డి వారిని నచ్చజెప్పి పంపించారు ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ సిద్దిపేట్ జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణ నరసింహులు శివయ్య శంకర్ జనగాం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదానందం మల్లేష్ ముదిరాజ్ యూత్ పోలిట్ సభ్యులు సత్యనారాయణ జిల్లా నాయకులు బాశుబోయిన చంద్రశేఖర్ నాగభూషణం బిక్షపతి నరేష్ ముదిరాజ్ కుంటర్ సత్యం గుమ్మడి శ్రీనివాస్ అశోక్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు