ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: నగరంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కఫ్‌ పరేడ్‌  ప్రాంతం జీడీ సోమనీ మార్గ్‌లోని జాలీ  మార్కెట్‌ బిల్డింగ్‌ 19వ అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న 9 అగ్నిమాపక శకటాలతో  సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమస్తున్నారు.