ముకేశ్‌ కంపెనీకి రూ.11 కోట్ల జరిమానా

ముంబయి, జనంసాక్షి: ముకేశ్‌ అంబాని కంపెనీకి సెబీ 11కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇన్‌సైడర్‌ గ్రూపులోని రిలయన్స్‌ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్‌-ఆర్‌పీఐఎల్‌..ఇండియన్‌ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌-ఐపీసీఎల్‌ షేర్లలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిందని సెబీ నిర్ధారించింది.

ఐపీసీఎల్‌ అనంతరం కాలంలో రిలయన్స్‌ ఇండ్ణ్ణ్ణసీస్‌లో విలీనం అయింది. ఈ విషయం ముందుగానే ఆర్‌పీఐఎల్కు తెలిసినందున తనకు అనుకూలంగా జరిపిందని సెబీ విచారణలో తేలింది. ఇదే అంశం ఇన్వెస్టర్లకు తెలియకపోవడం వల్ల నష్టపోయారని చెప్పింది. 1992 నాటి సెబీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిషిద్ధ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం 11 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది.