Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రికి షిండే, ఆజాద్‌ ఫోన్‌

హైదరాబాద్‌: కేంద్ర హోశాఖ మంత్రి షిండే, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి చలో అసెంబ్లీ కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడిరచింది. రాష్ట్రానికి అదనపు బలగాలను పంపడంలో కేంద్రం తీసుకున్న చర్యలపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకున్న చర్యలపట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎంఓ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *