హైదరాబాద్: ఎన్జీవో సంఘ నేతలు గోపాల్‌రెడ్డి, అశోక్‌బాబు ఖజానా ఉద్యోగుల సమ్మెపై ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని ఎన్టీవో నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ఖజానా శాఖ ఉద్యోగుల సహాయ నిరాకరణ రెండోరోజు కూడా కొనసాగడంతో 13 జిల్లాల్లో ఆర్ధిక లావాదేవీలు స్తంభించాయి.




