Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రితో కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకారం తెలిపారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన నల్గొండ జిల్లాకు నీటి విడుదలతో పాటు వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. తెలంగాణ మంత్రులైనా, కేసీఆర్‌ అయినా పదవులు పక్కన పెట్టి పార్టీలకతీతంగా పోరాడితేనే తెలంగాణ వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. తమ జిల్లా కేంద్రానికి మంత్రులు వచ్చి సంవత్సరం దాటిందని, డీఆర్సీ సమావేశాలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కూడా పొలిట్‌ బ్యూర్‌ సమావేశంలోనూ సీట్లు ఎలా పెంచుకోవాలనే అలోచన కనిపించిందని ఆయన విమర్శించారు. ప్రజల్లోనూ కేసీఆర్‌ పట్ట క్రమేణా వ్యతిరేకత పెరుగుతోందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *