చిత్తూరు: అక్రమంగా నిల్వఉంచిన రూ.1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన 232 ఎర్రచందన దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ దాడిలో పాకాల సీఐ వెంకటనారాయణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.




