Thursday, 5 November 2026

ముఖ్యమంత్రి రాక సందర్భంగా రూట్ మ్యాప్ ను పరిశీలించిన డీఐజీ చౌహన్

గద్వాల నడిగడ్డ, జూన్ 10 (జనం సాక్షి);ఈ నెల 12న సోమవారం జిల్లా కేంద్రం లోని ఐ. డి. ఓ. సి బిల్డింగ్, జిల్లా పోలీస్ కార్యాలయం, బి. ఆర్. ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ వస్తున్న సందర్బంగా శనివారం జోగుళాంబ జోన్ డి. ఐ. జి ఎల్. ఎస్ .చౌహాన్,జిల్లా ఎస్పీ కె. సృజన తో కలిసి ముఖ్య మంత్రి పర్యటన రూట్ మ్యాప్ ను, జిల్లా పోలీస్ కార్యాలయం ను పరిశీలించారు.అందులో బాగంగా నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా కాంట్రాక్టర్ల కు తగు సూచనలు చేశారు. అనంతరం హెలిప్యాడ్ ను, బి. ఆర్. ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని, పబ్లిక్ మీటింగ్ సభ స్థలాన్ని, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో డి. ఎస్పి ఎన్ సి హెచ్ రంగ స్వామి, ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, గద్వాల సి. ఐ చంద్ర శేఖర్, ఆలంపూర్ సి ఐ శ్రీనివాస్, కాంట్రాక్టర్ లు, పోలీస్ హౌసింగ్ ఇంజనీర్లు శాంతి నగర్ సి ఐ శివ శంకర్, ఎస్సై లు వెంకట స్వామి, కురుమయ్య, గోకారి తదితరులు పాల్గొన్నారు.