ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని చీకోడ్ గ్రామంలో ఎంపీపీ జడ్పిటిసి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా, ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ నిరుపేదలకు ఒక వరం లాంటిది సీఎం ఆర్థిక సాయం ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా లబ్ధిదారుని ఇంటికి చేరుకుంటున్న సీఎం ఆర్థిక సాయం ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా లేడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఎన్ విజయ రామారావు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు ,మాజీ సర్పంచి పోతిరెడ్డి రాజయ్య ,మండల అంబేత్కర్ సంఘం అధ్యక్షులు కాం పెళ్లి శ్రీనివాస్, లక్ష్మణ్ ,మాజీ ఎంపిటిసి బొమ్మని ఆంజనేయులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
Attachments area