Thursday, 5 November 2026

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత.

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత.

జనం సాక్షి, జనవరి10, భువనగిరి (ఆర్. సీ) న్యూస్ ;

భువనగిరి మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గాదే యాదగిరి మరియు షేక్ జాఫర్ షరీఫ్ లకు గ్రామ సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 60 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల శంకర్ గౌడ్ మరియు వార్డు సభ్యులు షేర్ ఖాన్, మల్లారెడ్డి, శ్రవణ్, బీఆర్ఎస్ యువజన నాయకులు జక్కజంగారెడ్డి, నాగరాజు, మధుమోహన్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.