ముప్కాల్ జనం సాక్షి మే 27
మండలంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది టోర్నమెంట్లో విజేతగా ఆర్మూర్ జట్టు గెలుపొందగా ద్వితీయ స్థానంలో ముప్కాల జట్టు గెలిచింది ఈ కార్యక్రమానికి ఏఎస్సై తొగర్ల సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రథమ బహుమతిని అందజేశారు ద్వితీయ బహుమతిని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భుమేశ్వర్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఇటువంటి క్రీడా పోటీలను ఎల్లప్పుడూ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు ఆయన తదుపరి జరిగే క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి తానే స్వయంగా స్వంత ఖర్చుతో బహుమతులు అందజేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు క్రీడాకారులు మరియు జాతీయ స్థాయి క్రీడాకారుడు కబడ్డీ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు
ముగిసిన జిల్లా స్థాయి సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్




