హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద చేపట్టిన మౌనదీక్ష ముగిసింది.జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టిన దీక్షకు పలువురు జేఏసీ నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగిన మౌనదీక్షను ముగిస్తున్నట్టు కోదండరాం ప్రకటించారు. సెప్టెంబర్ 30 జరిగిన తెలంగాణ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం అవలంభించిన నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపట్టారు.




