Wednesday, 4 November 2026

ముగిసిన పది పరీక్షలు –  విద్యార్థుల ఆనందం.

.బెల్లంపల్లి, ఏప్రిల్ 11, (జనంసాక్షి )పదో తరగతి పరీక్షలు మంగళవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో  పకడ్బందీ ఏర్పాట్ల నడుమ  ఈనెల 3 న ప్రారంభమైన పరీక్షలు  మంగళవారం ముగిశాయి. పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఈలలు, కేకలతో ఆనందంతో సందడి చేశారు. వార్షిక పరీక్షల కోసం గత కొన్ని నెలల నుంచి పట్టుదలతో చదివి పరీక్షలు రాయడం జరిగిందని, నేటితో పరీక్షలు ముగియడంతో ఇక ఎంజాయ్ అని పలువురు విద్యార్థులు అన్నారు. విద్యార్థులందరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు తమ స్నేహాన్ని ముందు ముందుకు తీసుకెళ్లేందుకు తమ సెల్ నెంబర్లు అడిగి తీసుకున్నారు.  గ్రామీణ ప్రాంతాల, దూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరవుతున్న టెన్త్ విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఎలాంటి చార్జీలు తీసుకోకుండా బెల్లంపల్లి ఆటో యూనియన్ ద్వారా ఆటోలు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు మే రెండో వారం తరువాత ప్రకటించనున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.