ముగ్గురికి సుఖప్రసవాలు.. కెసిఆర్ కిట్లు అందజేత
టేకులపల్లి, మార్చి 30( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో గురువారం ముగ్గురికి సుఖవంతమైన ప్రసవాలు జరిగాయి. తావుర్య తండ కు చెందిన గుగులోత్ ప్రమీల భర్త పేరు నవీన్ తన రెండవ కాన్పు లో మగ బిడ్డ కు జన్మనిచ్చింది. ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పూనెం శ్రావణి భర్త పేరు అంజయ్య తన మొదటి కాన్పులో పాప కు జన్మనివ్వగా, లచ్చగూడెం గ్రామానికి చెందిన ఎద్దుల స్వాతి భర్త పేరు శరత్ బాబు మూడవ కాన్పు లో పాప కు జన్మనివ్వడం జరిగింది. ఈ ప్రసవాలల్లో తల్లి బిడ్డ లు ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ తెలిపారు.ఈ ప్రసవాలను స్టాఫ్ నర్స్ లు తమ్మళ్ల సునీత, వేదమణిలు పాల్గొన్నారు.ఈ ముగ్గురికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ చేతుల మీదుగా కేసీఆర్ కిట్లు అందించారు.
ముగ్గురికి సుఖప్రసవాలు.. కెసిఆర్ కిట్లు అందజేత




