Monday, 2 November 2026

ముత్యాలమ్మ గుడి అభి వృద్ధి కి పెనుబల్లి యువకుల విరాళం

పెనుబల్లిముత్యాలమ్మ గుడి షెడ్డు నిర్మాణానికి స్థానికులు ఎన్ వి కె వి. ప్రసాద్ విరాళంగా లక్ష రూపాయలు గుడి కమిటీకి అందించటం జరిగింది, ఎన్ వి కె వి ప్రసాద్  తల్లితండ్రులైన నాగుల రాముల, వరలక్ష్మిల జ్ఞాపకార్థం ఈ విరాళం ఇవ్వడం జరిగింది, అలాగే  పెనుబల్లి గ్రామానికి చెందిన మట్టా రాజేష్, మట్టా సురేశ్ అన్నదమ్ములు తమ తండ్రి మట్టా వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం గర్భగుడి కి గ్రానైట్ రాళ్ళను అందించటం జరిగింది, ఈ సందర్భం గా గుడి కమిటి సభ్యులు, పెనుబల్లి గ్రామ ప్రజలు వారికి  ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.