Wednesday, 4 November 2026

ముదిరాజ్ కులస్తుల అభివృద్ధిముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ 

 

 

 

 

జనం సాక్షి /కొల్చారం మండలంలో నేడు ముదిరాజ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షుడిగా కోనాపూర్ రాజు, మండల అధ్యక్షుడిగా రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుట్టిమదు, అంశానిపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా రంగంపేట  సుధాకర్, సహాయ కార్యదర్శిగా రాంపూర్ కు చెందిన నర్సింలు కోశాధికారిగా అప్పాజిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్, శేఖర్, ప్రచార కార్యదర్శిగా వరిగుంతం గ్రామానికి చెందిన చిన్నారపు రాము. కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, శ్రీహరి అభిలాష్ సుధాకర్ సతీష్ లను ఎన్నుకున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు