*
అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య ప్రయత్నం..*బాధితుడిని భుజాల పై ఎత్తుకుని వచ్చిన కానిస్టేబుల్ జైపాల్.సరైన సమయానికి ఆసుపత్రికి తేవడం ద్వారానే కాపడగలిగామన్న వైద్యులు.కానిస్టేబుల్ నాయిని జైపాల్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ,సి ఐ,ఎస్ఐ…
జహీరాబాద్ ఏప్రిల్ 17 (జనం సాక్షి న్యూస్)ఆత్మహత్య చేసుకోవడానికి విషం సేవించిన యువకుడిని భుజాలపై మూసుకొని వచ్చి సరైన సమయానికి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ నాయిని జైపాల్ ..జహీరాబాద్ నియోజకవర్గం అల్గొల్ గ్రామం నుండి పోలీసులకు 100 నెంబర్ కు ఆదివారం రాత్రి తన అన్న రాజు తండ్రి నర్సింలు ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేశాడని తర్వాత ఫోన్ చేస్తే లేపడం లేదని తమ అన్న ఆచూకీ కనిపెట్టి కాపాడాలని అల్గోల్ గ్రామవాసి నర్సింలు కూతురు మహేశ్వరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితుడి ఫోన్ నెట్వర్క్ ఆధారంగా ఆచూకీ కనుగొని బాధితుడి వద్దకు చేరుకోగా అతడు మద్యంలో విషపదార్థాలు కలుపుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.. బాధితుడు రాజు విషం సేవించిన ప్రాంతం అల్గొల్ అడవి ప్రాంతం కాగా అక్కడికి వాహనాలు ఏమి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పోలీసు కానిస్టేబుల్ నాయిని జైపాల్ బాధితుడి చెల్లెలు మహేశ్వరి వారి బంధువు దాదాపు కిలోమీటర్ నర నడుచుకుంటూ వెళ్లి బాధితుడు కొన ఊపిరిపై ఉండడం గమనించిన కానిస్టేబుల్ జైపాల్ రాజు ను తన భుజంపై మోసుకొని మోసుకొని వచ్చి పోలీసు వాహనంలో హుటాహుటిన జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు విషానికి విరుగుడు మందు ఇచ్చి ప్రాణాలు కాపాడారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చాకచక్యంగా వ్యవహరించి సరైన సమయానికి ఆసుపత్రికి తేవడం ద్వారానే బాధితుడు బ్రతిక్యాడని మరో పది పదిహేను నిమిషాలు ఆలస్యం అయితే తన ప్రాణం కాపాడి ఉండేవాళ్ళం కాదని సమయానికి ఆస్పత్రికి తీసుకొని వచ్చిన పోలీసులను అభినందించారు.. బాధితుడు రాజు 27 సంవత్సరాలు తండ్రి నరసింహులు తనకున్న అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని సమాచారం. చాకచక్యంగా వ్యవహరించి రాజు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాయిని జైపాల్ మరియు ఇతర సిబ్బందిని స్థానిక డిఎస్పి రఘు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తోట భూపతి, ఎస్సై శ్రీకాంత్ తదితరులు అభినందించారు..




