మునుగోడులో బిఆర్ఎస్ విజయం ఖాయం… దొడ్ల రామకృష్ణ గౌడ్…
కూకట్ పల్లి అక్టోబర్ 28(జనంసాక్షి ):
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ల పిలుపు మేరకు శుక్రవారం యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చండూరు లోని ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం గుండ్రంపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, వాసుదేవరావు, రాములుగౌడ్, ప్రదీప్ రెడ్డి, సాయిగౌడ్, హరిప్రసాద్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.




