మునుగోడు నుండి ఫ్లోరిన్ భూతాన్ని పారాదోలింది సీఎం కెసిఆర్

*ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం
*ఆసరా పింఛన్లు పంపిచేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మునుగోడు ఆగస్టు17(జనం సాక్షి):
ఫ్లోరిన్ మహమ్మారి విలయ తాండవంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే ఫ్లోరిన్ నివారణకు కృషి చేసింది మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్రవిద్యుత్ శాఖమాత్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసరా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసమే తెరాస పనిచేస్తుందన్నారు.ఫించన్ల ప్రణాళిక రూపొందించడంలో సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని అన్నారు అందుకు నిదర్శనం 57సంవత్సరాలకు కుదింపు అని అన్నారు.ఈసందర్బంగా లబ్ధిదారులకు గుర్తింపు కార్డు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అందజేశారు.2014 ముందు ఫ్లోరోసిస్ రక్కసితో ఈప్రాంత మంత ఎడారిగా మరే ప్రమాదం ఉందని దేశ జలనిపులు చెప్పిన ఈప్రాంతాన్ని పాలించిన గత పాలకులు పట్టించుకొనే పాపన్న పోలేేదు గతంలో ఫ్లోరోసిస్ తో మూడు సంవత్సరాల పిల్లవాడు 30 సంవత్సరాలు కనిపించిన కూడా ఆనాటి పాలకులు పట్టించుకోలేదన్నారు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు ఈ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందజేసి ఈప్రాంతం నుండి ఫ్లోరోసిస్ తరిమికొట్టాడు అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పథకాలు తెలంగాణ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి,శాదీముభరక్,రైతు బంధు,రైతు బీమా,వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు,బాలింతలకు12 వేల రూపాయలను కెసిఆర్ కిట్టు,రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏకరనినికి10 వేల చొప్పున రైతు బందు,వంటి పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈకార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు,జడ్పిటిసి నారబోయిన స్వరూపరాణిరవిముదిరాజ్,ఎంపిపి కర్నాటి స్వామి యాదవ్,ఎంపీటీసీ బొడ్డు శ్రావణినాగరాజుగౌడ్,ఈద శరత్ నిర్మల, మీర్యాల వెంకన్న ఎంపిఓ కె. సుమలత పంచాయతీకార్యదర్శి మురళీమోహన్ ఆసరా పింఛన్ లబ్ధిదారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.