Tuesday, 3 November 2026

మునుగోడు ప్రచారంలో దోమ మండల బిఏస్పి ఇంచార్జ్

మునుగోడు ప్రచారంలో దోమ మండల బిఏస్పి ఇంచార్జ్
గార్ల పల్లి మల్లన్న
దోమ అక్టోబరు 31(జనం సాక్షి)
ఈరోజు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తును ప్రతి ఇంటికి ప్రతి గడపకు పరిచయం చేసి మన బీసీ ముద్దుబిడ్డ ఆందోజు శంకరాచారి గారిని గెలిపియాలని అహర్నిశలు కష్టపడుతూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎక్కడ సమయం వృధా చేయకుండా అటు రోడ్డుపై నుంచి వెళుతున్న టిఫిన్ బండిని ఆపి అక్కడే టిఫిన్ చేసి అనంతరం పత్తి చేలల్లో పత్తి తీస్తున్న రైతు కూలీల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టాల్లో భాగస్వామ్యమై అల్లా బాధలను వాళ్ళ కష్టాలను తెలుసుకొని వారికి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ కష్టాలకు చరమగీతం పాడొచ్చు అని బహుజన సమాజ్ పార్టీ దోమ మండల ఇన్చార్జి గార్లపల్లి మల్లన్న గారు అన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే అట్టడుగు వర్గాల అగ్రకుల పేద ప్రజల బతుకులు మారుతాయని అన్నారు ఈ ప్రచారంలో భాగంగా పరిగి మండల్ ఇన్చార్జి ధనరాజ్ పరిగి మండల సెక్టార్ కమిటీ అధ్యక్షుడు మతాల సింగం మమతాబాద్ మండల్ ఇంచార్జ్ రాము కృష్ణ తదితరులు పాల్గొన్నార