Wednesday, 4 November 2026

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం డైరీ ఆవిష్కరణ

కామారెడ్డి ప్రతినిధి మార్చి25 జనంసాక్షి
తెలంగాణ మున్నూరుకాపు  ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు  ముదాం శంకర్ పటేల్ అధ్యక్షతన ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్‌పటేల్‌ విశ్రాంత ఉద్యోగుల సంఘ   భవనంలో 2023 డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సమాజంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటూ ప్రజలను చైతన్య వంతులుగా తీర్చి దిద్దాలన్నారు.జర్నలిస్టు ఫోరం డైరీని  ఆవిష్కరించి ఎంతో సమాచారాన్ని జర్నలిస్టులకు అందించారన్నారు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రశంసించారు. మున్నూరుకాపు జర్నలిస్టులు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జర్నలిస్ట్ ఫోరం మరింత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు  యోగేశ్వర్ పటేల్, కామారెడ్డి జిల్లా గౌరవాధ్యక్షులు దయానంద పటేల్, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ముదాం శివశంకర్ పటేల్,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు దాదే వెంకట్ పటేల్, నల్లకుంట సతీష్ పటేల్ ,శ్రీనివాస్ రెడ్డి పటేల్,అనిల్ పటేల్, నక్క మల్లేశం పటేల్,సునీల్ పటేల్,దిలీప్ పటేల్,నక్క సిద్ధిరాములు పటేల్,కార్యవర్గ సభ్యులు,రాష్ట్రస్థాయి నాయకులు, పాల్గొన్నారు.