Tuesday, 3 November 2026

మున్సిపల్ చైర్మన్ కు కార్మికుల జీతాలు, బకాయి ఏరియర్స్ చెల్లించాలని వినతి.. షేక్ యాకుబ్ షావలి టిపిఎమ్ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి

ఇల్లందు జూలై 3 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావును తన చాంబర్లోకలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి చైర్మెన్ కు వివ రిస్తూ మున్సిపల్ కార్మికులు 2నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పిఆర్సి బకాయిలు కార్మికులకుకార్మికులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారుగత ఏడు నెలలుగా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ జమ కావడంలేదని పై సమస్యలు పరిష్కారానికి వెంటనే పూనుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు లేనియెడల దశల వారి ఆందోళన చేస్తామని చైర్మన్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయిని కృష్ణ, వేముల గురునాథం, రాము, కలీం, దాసు, కలాం,తదితరులు పాల్గొన్నారు.