పెనుబల్లి, జులై 3(జనం సాక్షి) పేదలందరికీ ఇల్లు, ఇళ్ళ స్థలా లు. పోడు సాగు దారులందరికి పట్టాలు ఇవ్వాల ని సి పి ఎం రాష్ట్ర కమిటిసభ్యురాలు మాచర్ల భారతి డిమాండ్ చేశారు,సోమవారం స్థానిక సి పి ఎం పార్టీ కార్యాలయంలోజరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయని, అంతు పంతులేని ఉచిత హామీలు ఇస్తున్నారని, నేటి వరకు పాలకులు పేద ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు, కనీసం పేద ప్రజలు ఉండటానికి స్థలం కేటాయించటం కానీ, ఇల్లు కట్టించవటం గాని, చేయని పాలకులు బూటకపు ప్రకటనలు చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ మాట్లాడుతూ పెనుబల్లి మండలంలో 14 పోడు కేంద్రాల్లో అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ కార్యదర్శి గాయం తిరుపతి రావు,మండల నాయకులు చలమాల నరసింహారావు, మిట్టపల్లి నాగమణి, నల్లమల్ల అరుణ్ ప్రతాప్, కలకోట చిన్న వెంకటేశ్వర్లు, పోతిని సత్యనారాయణ, ఎం బాజీ, సిపిఎం సీనియర్ నాయకులు మామిళ్ళ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.





