మల్దకల్ మే 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.మల్దకల్ గ్రామానికి చెందిన అమృత్ కుమార్ మేటి దాదాపు 300 మంది ఉపాధి కూలీలు కూలీలు పనిచేస్తున్నారు. వాయిలకుంట చెరువు దగ్గర ఫీడర్ ఛానల్ పనులు చురుకుగా సాగుతున్నాయి.ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు కూలీలు పనులు చేసి ఇంటికి వస్తున్నారు.ఒక రోజుకు 200 రూపాయలు డబ్బులు వస్తున్నాయని కూలీలు సంతోషంవ్యక్తం చేస్తున్నారు.మండలంలో ఉపాధి పనులు అమరవాయి,విఠలాపురం,మల్లెందొడ్డి,పెద్దదొడ్డి,మద్దెలబండ,నీలిపల్లి తదితర గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతున్నాయి.అధికారులు ఎప్పటికప్పుడు ఉపాధి పనులపై పర్యవేక్షణ చేస్తూ పై అధికారులకు తెలియజేస్తారు.ఎంపీడీవో కృష్ణయ్య,ఏపీవో స్వామి,ఈసీ నాగరాజు,టెక్నికల్ అసిస్టెంట్ అనుష తదితరులు పనులను తనిఖీలు చేస్తారు.




