ముషారఫ్ అరెస్టుకు కోర్టు ఆదేశం
ఇస్లామాబాద్, జనంసాక్షి: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరెస్టుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పొడిగించాలన్న ముషారఫ్ అభ్యర్థునను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే తన అంగరక్షకుల సాయంతో పోలీసుల కన్నుగప్పి ముషారఫ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.