Thursday, 5 November 2026

ముసురుకుంది

– తెలుగు రాష్టాల్ల్రో మోస్తరు నుంచి భారీ వర్షాలు
– హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
– కోస్తాంధ్రలో కుండపోత
– ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలను ముంచెత్తిన వరుణుడు
– కోనసీమలో దెబ్బతిన్న నారుమళ్లు
– ఇరు రాష్టాల్ల్రో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
– ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద నీరు
– గేట్లు తెరచి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు
– అదిలాబాద్‌లో గోడకూలి ఇద్దరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్టాల్ల్రో వరుణుడు ముసురుకున్నాడు. బుధవారం సాయంత్రం నుంచి మోస్తరు నుండి భారీ వర్సాలతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆంధప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. దీంతో కోనసీమలో ఖరీఫ్‌ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడింది. ముంపునీరు దిగక నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. నారుమడుల్లోంచి ముంపునీటిని బయటకు పంపేందుకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు కాకుండా మాగాణిలో మెరక ప్రాంత ఆయకట్టులో ఖరీఫ్‌ నాట్లు పడుతున్నాయి. వర్షాలు కారణంగా ఈ పనులూ వేగంగా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ 20 రోజులు పైబడి వృథా అయ్యింది. ఈ ప్రభావం పంట చేతికొచ్చే సమయంపై పడుతుందని రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయానికి రావులపాలెంలో 5.57 సెం.విూ, గడలలో 5.42 సెం.విూ, కపిలేశ్వరంలో 5.35 సెం.విూల వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనానికి ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తొలుత కురిసిన తొలకరి వానలకు వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు.. నారుమళ్లు, నాట్లు వేశారు. విస్తారంగా కురిసిన వర్షాలకు అవి కుళ్లిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రూ..5-10వేల పెట్టుబడి పెట్టడంతో నారుమళ్లు, నాట్లు కుళ్లిపోతే తిరిగి వేసేందుకు అవకాశం ఉంటుందో ఉండదోనని భయపడుతున్నారు. నారుమళ్లు వేసేందుకు అవకాశం లేకపోతే, నారు కూడా దొరికే పరిస్థితి లేనందున పంట కోల్పోవాల్సి వస్తుందని భయం వెంటాడుతోంది. అరటి తోటలలోనూ వర్షానికి నీరు చేరడంతో గెలలు పెరగక నష్టపోవాల్సి వస్తుందని అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు
చేరడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ముసురు వానతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం పడింది. రెడ్డిగూడెం, గన్నవరం, కోటపాడు, వత్సవాయి ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన పడింది. చాట్రాయి, వీర్లుపాడు, చందర్లపాడు, ఉంగుటూరు, బాపులపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు, నందిగామ ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడుతున్నాయి. జగ్గయ్యపేట, మైలవరం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు రెడ్డిగూడెం మండలం రంగాపురంలో 71.75 మి.విూ, గన్నవరంలో 71.50 మి.విూ, రెడ్డిగూడెంలో 54.75 మి.విూ, కోటపాడులో 54.25 మి.విూ, అల్లూరులో 50.50 మి.విూ, వత్సవాయిలో 50.25 మి.విూ, చందర్లపాడులో 50 మి.విూల వర్షం నమోదైంది.
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం..
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎల్‌బి నగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, హైయత్‌ నగర్‌, బోడుప్పల్‌, యూసఫ్‌ గూడ, అవిూర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయాన్నే కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే వారు రహదారులపై వర్షం నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారుపై మొకాళ్ల లోతు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకివర్షంపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షం..
సూర్యాపేట మండలం ఎల్కారం తదితర ప్రాంతాల్లో ఈదురు గాలలతో వర్షం కురిసింది. సూర్యాపేట – దంతాల పల్లి రహదారిపై భారీ వృక్షం నేలకొరగడంతో కిలో విూటరుమేర వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుండి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, నేలకొండపల్లి, కామేపల్లి, చింతకాని, కొత్తగూడెం, ఇల్లందు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు కూడలి ప్రాంతంలో నీరు చేరి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలోని మున్నేరుకు వరద నీరు చేరుతుంది. రాజీవ్‌ గృహకల్ప వద్ద మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తుంది.  అదేవిధంగా అదిలాబాద్‌ జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కౌటారం, ఇచ్చాల, సిరిపూర్‌ ప్రాంతాల్లో ముసురు పడుతుండగా, మోతుల్‌, బోద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదిలాబాద్‌ పట్టణంలో పాత ఉర్దూపాఠశాల గోడ వర్షానికి నాని కూలడంతో ఇద్దరు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో పిల్లలు ఎవరూ లేకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700.6 కాగాప్రస్తుత నీటి మట్టం 698 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 23వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 23వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
కుమరం ప్రాజెక్టుల వరద ఉదృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 35వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మూడు గేట్లను ఎత్తిన అధికారులు 13వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జయశంకర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం నిలకడగా సాగుతుంది. వర్షం కారణంగా ఏడవ రోజు మేడిగడ్డ, అన్నార బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌, గ్రావిటీ కెనాల్‌ పనులు నిలిచిపోయాయి.