Monday, 2 November 2026

ముస్లింల హృదయాలను గాయపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన నాయకులు

ముస్లింల హృదయాలను గాయపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన నాయకులు జహీరాబాద్ మార్చి 30( జనం సాక్షి )జహీరాబాద్‌లోని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ ప్రతినిధి బృందం జహీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీకాంత్‌ ను కలిసి జహీరాబాద్‌ మజ్లిస్‌ అధ్యక్షులు ముహమ్మద్‌ అత్తర్ అహ్మద్‌తో పాటు మాజీ వైస్ చైర్మన్ అజ్మత్‌ పాషా, పార్టీ బాధ్యులతో కలిసి లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు. గత రాత్రి జహీరాబాద్‌లో శ్రీరామ్‌ నవమి సందర్భంగా హైదరాబాద్‌, జహీరాబాద్‌ ముస్లింలపై చేకోటి ప్రవీణ్‌ అనే వ్యక్తి, ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, శాసన సభాపక్ష నేత  అక్బరుద్దీన్‌ ఒవైసీ జహీరాబాద్‌లో గంగా జుమ్నా వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని, ముస్లింల హృదయాలను గాయపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ ముహమ్మద్ అత్తర్ అహ్మద్ పోలీసులను డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా చేయాలనీ డిమాండ్ చేశారు ఈ సందర్భంలో సీనియర్ నాయకుడు మెుహిఉద్దీన్ ఘౌరి, ఆమెర్ బిన్ అబ్దుల్లా షోయెబ్, ఇలియాజ్, తసఫుర్, షఫి, ముహమ్మద్ అజీమ్, ముహమ్మద్ షరీఫ్, ముహమ్మద్ సమీర్, ముహమ్మద్ ఫయాజ్, ముహమ్మద్ రఫీక్ పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.