Tuesday, 3 November 2026

ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణ హౌసింగ్ బోర్డ్ లో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కుల మతాలకు అతీతంగా సకల జనులు చేస్తున్న సమ్మెను చూసి విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూసి శ్రీమతి సోనియా గాంధీ చెల్లించిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతున్న కూడా పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ హైదరాబాద్ తో కూడిన రాష్ట్రం శ్ర సోనియా గాంధీ ప్రకటించారు.
2014లో సాధారణ ఎన్నికలలో కెసిఆర్ నీళ్లు నిధులు నియామకాలు అనేకమైన మోసపూరితమైన హామీలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి నీటికి తొమ్మిది సంవత్సరాలు గడిచిపోతున్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అమరుల ప్రాణ త్యాగాలపై కల్వకుంట్ల కుటుంబ రాజభోగాలు అనుభవిస్తుందన్నారు నీళ్లు నిధులు నియామకాలు కేవలం కల్వకుంట్ల కుటుంబానికి టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే సొంతంమయ్యాయని అన్నారు ఎన్నికలలో టిఆర్ఎస్ ఇచ్చిన ఒక హామీ కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు రైతు రుణమాఫీ మొదలు, దళితులకు మూడు ఎకరాల భూమి,రెండు పడకల గదులు ఇండ్ల నిర్మాణం, దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకుముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు,ఇంటికో ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే కేసిఆర్ ప్రజలకు లక్ష మోసంపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను మరచి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంపై పడి దోచుకోవడం దాచుకోవడం తప్ప వరగబెట్టింది ఏమీ లేదని అన్నారు రానున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలు విద్యార్థులు యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు .ఈకార్యక్రమంలో కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ అమానాతుల్లా వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి మధు చుక్క స్వామి గుమ్మడి రమేష్ హౌసింగ్ బోర్డ్ మస్జిద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షరీఫ్ మహమ్మద్ జహంగీర్ మహమ్మద్ కరామతుల్లా మల్సాబ్ మహమ్మద్ అమానతుల్లా ఎండి జాంగిర్ మొహమ్మద్ హిదాయతుల్లా అహ్మద్ సోహెల్ ఎండి ఇర్షాద్ మహమ్మద్ సఫివుల్లా మహమ్మద్ అస్లం మీరు సుజాయత్ అలీ ఎండి అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.