భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జాతీయ పతావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు గ్రామ ముఖ ద్వారం వద్ద గల తెలంగాణ తల్లి , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మనీష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. నేటి నుండి 22వ తారీకు వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్ , వార్డు సభ్యులు పబ్బాల రమేష్ , చుక్కల కమలమ్మ , కోట పోచయ్య , కోఆప్షన్ సభ్యులు కళ్లెం కృష్ణ గౌడ్ , ఎశబోయిన లక్ష్మీ శ్రీశైలం , కోట స్వామి దాసు , బిఆర్ఎస్ మండల నాయకులు చుక్కల శంకర్ , బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు కోట చంద్రశేఖర్ (సీఎం) , బిఆర్ఎస్ నాయకులు గుండు రవి గౌడ్ , నోముల నరసింహ యాదవ్ (సిఇఓ) గ్రామ కార్యదర్శి అమని , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం: సర్పంచ్ గుండు మనీష్ గౌడ్




