Tuesday, 3 November 2026

ముస్లీం వర్గాలకు విదేశీ నిధులు నిషేధం

వియన్నా: ఆస్ట్రియాలో ముస్లీం గ్రూపులకు విదేశీ నిధులను నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఇస్లాం చట్టాన్ని సవరించింది. ఏ ఇతర మైనారిటీ వర్గాలకు ఇది వర్తించక పోవడం గమనార్హం. అయితే ఈ చట్టాన్ని కాథలిక్ బిషప్‌ల మద్ధతున్న రోమన్ కాథలిక్ జనాభా ఈ చట్టాన్ని కొద్దిగా వ్యతిరేకించింది. అక్కడి ముస్లిం సమాజాలు ఈ చట్టాన్ని ఒప్పుకున్నాయి. కానీ టర్కీలోని ముస్లీం సంక్షేమ అధికార వర్గాలు మాత్రం ఈ చట్టంతో హతాషులయ్యారు.

ఆస్ట్రియా రకపు ఇస్లాం కోరుకుంటున్నాము గానీ, విదేశీయులు రుద్దే ఇస్లాం మాత్రం కాదన్నారు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అయిన 28 ఏళ్ళ సెబాస్టియన్ కుర్జ్. ఆస్ట్రియాలోని 50 లక్షల ముస్లింలు ఆ దేశ జనాభాలో 6%గా వున్నారు. వీరిలో ఎక్కువగా టర్కీ నుంచి వచ్చిన వలస కూలీ కుటుంబాల వారే. వీరిలోని చాలా మంది ఇమామ్‌లను టర్కీ దేశ మత వ్యవహారాల డైరెక్టరేట్ దియానెట్ పంపి వారికి నిధులు సమకూరుస్తుంది. విదేశీ నిధుల నిషేధంతో ఆస్ట్రియాలో మత స్వేచ్ఛ వందేళ్ళు వెనక్కిపోయిందని దియానెట్ అధినేత మెహ్మెత్ గోర్మెజ్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *