హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముహుర్త బలం లేదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. అందుకే ఆయన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానంద సరస్వతి ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం దేశానికి అరిష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం చేతగానితనం వల్లే అలాంటి వాటిపై స్పష్టమైన చర్యలు తీసుకోలేక పోతుందని స్వరూపానంద సరస్వతి స్పష్టం చేశారు




