నిర్వహించాలి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం ఉంచాలని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి టియు డబ్ల్యూజే-ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, నాయకులువినతి పత్రం అందజేశారు. వికారాబాద్ జనంసాక్షి మార్చ్ 9 మూడవ విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలి మూడవ విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశం ఉంచాలని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి టియు డబ్ల్యూజే-ఐజేయు జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్,జిల్లా కోశాధికారి కే.రాఘవేందర్, నాయకులు సమ్మని రవీందర్,సుధాకర్,లక్ష్మణ్‌లు కోటిలింగం వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఇప్పటికీ మొదటి, రెండవ విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించారని చెప్పారు. ఇంకా ప్రజాపక్షం, మనం, విశాలాంధ్ర, క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ తదితర దినపత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రావాల్సి ఉందన్నారు. దేనికి గాను వీలైనంత త్వరగా మూడవ విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించి అర్హులైన జర్నలిస్ట్లందరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరడం జరిగింది.
మూడవ విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశం




