కోటగిరి మార్చి 9 జనం సాక్షి:-స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలి,అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని, అందుకు గాను మహిళల సాధికారతకు మరిన్ని చట్టాలు అవసరమని ఎంఈఓ నాగనాథ్ పేర్కొన్నా రు.కోటగిరి ఎంఆర్సి కార్యాలయంలో గురువారం ఉమ్మడి కోటగిరి మండల పిఆర్టియు శాఖల ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలకు వివిధ రకాల ఆటలు నిర్వహించారు.తదనంతరం మండల మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంఈఓ నాగ్ నాథ్ మాట్లాడుతూ.. మహిళా శక్తికి మించిన శక్తి ఏదీ లేదని వారిని గౌరవించుకోవడం మనకు ఎంతో గర్వకారణమని మహిళలను కొనియాడారు.అయిన కొన్ని చోట్ల స్త్రీలు అణిచివేతకు గురి అవుతున్న ఘటనలు చూస్తే చాలా ఆందోళన కలిగించే విషయం అన్నారు. నేటి మహిళలు సమాజానికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారని అన్నారు.ఈ వేడుకలలో టిఆర్టియు కోటగిరి, పోతంగల్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గంగ రాజు,వెంకటేష్,ప్రశాంత్ కిరణ్,కృష్ణ మోహన్, జిల్లా బాధ్యులు శానం సాయిలు,రాష్ట్ర బాధ్యులు సత్య నారాయణ,మండల బాధ్యులు స్రవంతి,పాషా, గాయత్రి,మండలంలోని మహిళా ఉపాధ్యాయ సోదరీమణులు,తదితరులు పాల్గొన్నారు.




