Monday, 2 November 2026

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

త్రిపుర : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో పోలీంగ్‌ నమోదైన ఈ రాష్ట్రాల్లో ఓటరు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసున్నాయి. నాగాలాండ్‌లో 60 స్థానాలకుగాను 59 స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60 శాసనసభ స్థానాలకు ఓట్ట లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ సరిహద్దును భద్రతా బలగాలు మూసివేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *