హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి మరో కోనసీమగా మార్చేందుకు సహాయమందిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించాడు. బీబీనగర్ మండలం గుర్రాలదండిలో .కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పలు హామీలను ఇచ్చారు.




