మృతదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల
మోత్కూరు డిసెంబర్ 31 జనంసాక్షి : మోత్కూరు మండలం పనకబండ గ్రామ మాజీ సర్పంచ్ బత్తిని హనుమంతు కుమారుడు బత్తిని రాంబాబు శనివారం ఉదయం అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థీవ దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ , టిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి. వారితోపాటు…మార్కెట్ కమిటి చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు, సీపీఐ సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్,సర్పంచ్ బత్తిని తిరుమలేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామీ,సుదర్శన్, సతీష్,ధనుంజయ తదితరులున్నారు.




