Wednesday, 4 November 2026

మృతి చెందిన గని కార్మికుడి కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలి

కరీంనగర్‌, ఆగస్టు 3 : గోదారిఖనిలోని 11వ గనిలో ఇటీవల అకస్మాతుగా మృతి చెందిన గని కార్మికుడు మల్లయ్య కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలని కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కె. మల్లయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో విధులు అనేక కారణాల వల్ల గని కార్మికులు మృతి చెందుతున్నారని ఇలాంటివారి కుటుంబాలను సంస్థ యాజమాన్యం ఆదుకోవాలని ఆయన కోరారు. గనుల్లో తగిన మౌలిక సదుపాయాలు లేని కారణంగా కార్మికులు మృత్యువాతపడుతున్నారని అన్నారు. సంస్థ యాజమాన్యాం కార్మిక సంక్షేమాన్ని కోరుతూ వారికి మౌలిక సదుపాయలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే మృతి చెందిన కార్మిక కుటుంబాలలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని యాజమాన్యాన్ని ఆయన కోరారు. ఈ సందర్భంగా మృతుడు మల్లయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *