Wednesday, 4 November 2026

రాందేవ్‌ బాబా దీక్షకు ప్రజలు మద్దతు తెలపాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : దేశంలో పెరిగిపోయిన అవినీతిని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని దేశంలోకి రప్పించేందుకు ఈ నెల 9న రాందేవ్‌ బాబా చేపట్టే దీక్షకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పతాంజలి యోగా సమితి, భారత్‌ స్వ అభిమాన్‌ ట్రస్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందన్న, రమేశ్‌లు పిలుపునిచ్చారు. దేశంలోని 120 కోట్ల ప్రజల సంక్షేమం కోసం రాందేవ్‌ బాబా చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని అన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈ నెల 9న ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో చేపట్టే దీక్షకు జిల్లాలోనిప్రజలు తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే 160 గ్రామాలలో అవినీతికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా బాబా దీక్షలకు ప్రజలు కూడా సంఘీభావం తెలపాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *