మృతుని కుటుంబానికి ఆర్థికసాయం..
ఊరుకొండ, డిసెంబర్ 5 (జనంసాక్షి):
ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన వడ్ల అంజనేయులు(40) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చర్లకోల కూడా లక్ష్మారెడ్డి మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ 5వేలు మరియు గ్రామ సర్పంచ్ విజయమ్మ పాండురంగారెడ్డి మృతుని కుటుంబసభ్యులను ఓదార్చి తమవంతు సహౕయంగా 5వేలు మొత్తం 10వేల రూపాయలు మృతుని భార్య ధనలక్ష్మి కి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ పరుశ రాములు, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, వార్డు సభ్యులు శాంతయ్య, నరేష్, నాయకులు రమేష్, ఉస్సేన్, నర్సింహ్మ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, సాయి, నూనె విజయ్, వెంకటేశ్ గౌడ్, రామాచారి, వేణాచారి తదితరులు పాల్గొన్నారు
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం..




