ఈనెల 7,8 తేదీల్లో హైదరాబాదులో జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
-పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు హలీం పాష.
గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 5 (జనం సాక్షి);
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈనెల 7,8 తేదీల్లో జరిగే పి.డి.ఎస్ యు రాష్ట్ర 22వ మహాసభల పోస్టర్లను జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సాధన కళాశాల ముందు సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు హాలీమ్ పాషా మాట్లాడుతూ ఉస్మానియా అరుణతారలు కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల ప్రసాద్ ల వారసత్వంతో పి డి ఎస్ యు విద్యార్థి సంఘం 1972 నుండి ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నదన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈనెల 7న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్క్ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. 8న బాగ్ లింగంపల్లి వి.ఎస్.టి హాల్లో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ మహాసభలకు హేతువాద సంఘం జాతీయ కార్యదర్శి నరేంద్ర నాయక్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ముఖ్యవక్తులుగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. నాగేశ్వరరావు, బోయిన్ పల్లి రాము తదితరులు వక్తలుగా మాట్లాడతారన్నారు.రాష్ట్రం నలుమూలల నుండి పి.డి.ఎస్.యు ప్రతినిధులు పాల్గొంటారన్నారనీ, ప్రగతిశీల మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పి.డి.ఎస్.యు మహాసభలకు సంపూర్ణ సంఘీభావం తెలియజేయాలని, మతసామరస్యానికి, లౌకికత్వానికి, మానవత్వానికి నిలయమైన హైదరాబాద్లో జరిగే పి.డి.ఎస్.యు రాష్ట్ర మహాసభల విద్యార్థి ప్రదర్శన, భారీ బహిరంగసభ, ప్రతినిధుల సభలను విజయవంతం చేయాలని ఆయనకోరారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు అరగిద్ద శివకుమార్, కోళ్ల అంజి, రంగస్వామి, నరసింహ, తరుణ్, పరమేష్, మోహన్, రాధికా, ప్రియా, ఐశ్వర్య,స్వాతి తదితరులు పాల్గొన్నారు
ఈనెల 7,8 తేదీల్లో హైదరాబాదులో జరిగే పి డి ఎస్ యు




