Wednesday, 4 November 2026

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

 బషీరాబాద్ జూన్ 05, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోనికొర్విచెడ్ గ్రామంలో మాజీ సర్పంచ్ చంద్రప్ప ఆదివారం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ పీ.శ్రీశైల్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి (నర్సి రెడ్డి) కలిసి మాజీ సర్పంచ్ చంద్రప్ప పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కోర్వి చేడ్ ఎంపిటిసి వడ్డే శ్రీనివాస్,చందర్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు