4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన.ఐదేళ్లలో 8 కొత్త గనులు ప్రారంభం–బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి పాత్ర గణనీయంతెలంగాణ దశాబ్ది స్ఫూర్తితో మరింత ముందుకుసింగరేణి సంబురాల్లో సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.శ్రీధర్–తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని, రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స్ఫూర్తితో రానున్న ఐదేళ్ల లో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి తద్వారా 50 వేల కోట్ల టర్నోవర్ కు ఎదగాలని కృత నిశ్చయంతో ముందుకు సాగాలని సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి సోమవారం జరిగిన సింగరేణి సంబురాలు ఉత్సవాలలో ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు.సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న సంబరాల్లో భాగంగా హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఆయన అమరవీరుల కు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో సాధించిందని, అదేవిధంగా దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ గత 9 ఏళ్లలోసాధించని వృద్ధిని సింగరేణి సంస్థ సాధించిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇప్పటివరకు 19 వేల ఉద్యోగాలను సింగరేణి సంస్థ కల్పించిందన్నారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 43 వేల మంది ఉద్యోగు ల్లో దాదాపు 45 శాతం ఉద్యోగులు యువకులేనని పేర్కొన్నారు.దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉండగా సింగరేణి సంస్థ మాత్రం అభివృద్ధిలో ముందుకు పోతూ ఇతర రాష్ట్రాల్లోకి కూడా అడుగు పెడుతోందన్నారు. సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బ్లాక్ నుండి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నదని, వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సూచన మేరకు సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇప్పటికే 1200 మెగా పట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిందని, 224 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కూడా రాష్ట్ర అవసరాలకు అందిస్తుందన్నారు. రానున్న కాలంలో సింగరేణి సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణి సంస్థ వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిని 100 మిలియన్ టన్నులకు పెంచడం కోసం 8 కొత్త గనులను ప్రారంభిస్తుందని,4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తగినన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ విధంగా రానున్న ఐదు సంవత్సరాలలో సింగరేణి టర్నోవర్ 50 వేల కోట్లకు పెంచడానికి కృషి జరుగుతుందన్నారు. ఇప్పటి లాగానే సింగరేణి సమిష్టితో కృషి చేస్తూ లక్షాలను సాధించాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.సింగరేణి సంబురాలు సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సన్మానం చేశారు. ఎన్సీడబ్ల్యుఏ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ నాగమణి, సెక్యూరిటీ గార్డు ఉబయదుల్లా, అధికారుల విభాగంలో డీజీఎం చక్రధర్ రావు, ఎస్వోఎం కృష్ణాచారిలను సన్మానించారు.అలాగే సింగరేణి సంబురాల సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ, సింగరేణి ప్రగతికి దర్పణంగా రూపొందించిన అద్భుత ప్రగతి పుస్తకాన్ని, ప్రముఖ కవి, సింగరేణి ఉద్యోగి జయరాజు రాసిన గీతాన్ని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఆవిష్కరించారు. అనంతరం జయరాజు, గణాశంకర్లను సన్మానించారు.
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం.




