.
దేవరుప్పుల,10(జనం సాక్షి):దేవరుప్పుల మండలం,ధర్మపురం గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడెల్లి యాకయ్య తల్లి ఎడెల్లి మల్లమ్మ మరణించగా..మృతదేహాన్ని సందర్శించి,పూలమాల వేసి,నివాళులర్పించి,ఆమె కుటుంబాన్ని పరామర్శించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపి,ఆర్థిక సహాయాన్ని దేవరుప్పుల మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మేడ ఎల్లయ్య, భూక్య సజ్జన్ నాయక్, బోనగిరి యాకస్వామి, జాటోత్ నవీన్, గ్రామ అధ్యక్షులు సంగి కుమార్,పడమటి తండా గ్రామ అధ్యక్షులు జాటోత్ వీరన్న, లకావత్ తండా గ్రామ అధ్యక్షులు బోడ యాకన్న,మండల నాయకులు రమేష్, మహేందర్, రాంబాబు, రవి,ఉప్పలయ్య,శోభన్ బాబు,వీరన్న,యూత్ నాయకులు ప్రకాష్,అనిల్,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.




