Thursday, 5 November 2026

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం  అందించి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు యఫ్ టీవీ ఫౌండర్   పాడి ఉదయ్ నందన్ రెడ్డి

 

వీణవంక జూన్ 11 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన  పలువురు ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందగా ఆ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యఫ్ టివి ఫౌండర్ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి మండల కేంద్రంలో మృతుల కుటుంబాలకు   ఆర్థిక సహాయం అందించి వారి  కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మృతులు దాసరపు రాజమల్లు. దాసరపు లచ్చమ్మ. దాసరపు లింగమ్మ. రెడ్డి రాజుల రాజయ్య. రాచర్ల మొగిలి. పోతురాజు కొమురయ్య.లు మృతి చెందగా ఆ కుటుంబాలకు పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు చేత ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసరపు ప్రభాకర్. మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్. అమృత ప్రభాకర్. వెన్నంపల్లి నారాయణ. మంతెన శ్రీధర్.ప్రకాష్. లోకేష్. వంశీకృష్ణ. చిన్నాల శ్రీకాంత్. కుమారస్వామి. రాజశేఖర్. కుమార్. రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు