కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 11 ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లోని కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతాపార్టీ అధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర ఈ ఉదయం స్వర్ణధామ్ నగర్ లో కొనసాగింది. బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెవల్లి శరణ్ ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ నాయకులు నిర్వహిస్తున్న ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తొమ్మిది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలన్న ఉత్సాహంతో కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు.12వ రోజు యాత్రలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యరావు, బీజేపీ సీనియర్ నాయకులు,వడ్డేపల్లి రాజేశ్వర్ రావు,మూసాపేట్ కార్పొరేటర్ కె. మహేందర్ లు గడప గడప తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం యువ నాయకుడు కర్నే ప్రకాష్,జిల్లా కార్యదర్శి పప్పు పటేల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి, డివిజన్ అధ్యక్షులు సంతోష్ గౌడ్,రాజముత్తుల,నాయకులు ధర్మ రావు, సాదుప్రతాప్ రెడ్డి,రవి కుమార్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, డివిజన్ నాయకులు అమర్ గౌడ్, రఘు,లక్ష్మీ కళ్యాణ్,వెంకటేష్,సాయి, లోకేష్,చతుర్వేద,వాణి,తులసి, బిజెవైయం నాయకులు శేఖర్,కార్తీక్,భగత్,అనిల్, సాయిచరన్,చైతన్య,నికిల్,అభిషేక్, రాష్ట్ర, జిల్లా,సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర : వడ్డేవల్లి శరన్ కుమార్




