హైదరాబాద్: 47 పురపాలక సంఘాల్లో వరదనీటితో ఇబ్బందులున్నాయని మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. మంత్రులు, కలెక్టర్లు, క్షేత్నస్థాయి సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.1.50లక్షలు ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించిందని చెప్పారు. దెబ్బతిన్న,కూలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణానికి, చనిపోయిన పశువులన్నింటికీ పరిహారం ఇచ్చేలా సీఎం ఆదేశించారని తెలియజేశారు. నీలం తుపాను కారణంగా 24 మంది మృతి చెందారు, 1274 ఇళ్లు దెబ్బతిన్నాయి, 5.25 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు, 25 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా 7వేల కి.మీ. మేర రహదారులు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. 427 గ్రామాల్లో తాగునీరు, 225 ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యతో పాటు 1300 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇప్పటి వరకు 170 కేంద్రాల్లో 68 వేల మందికి పునరావాహం కల్పించినట్లు మంత్రి రఘువీరారెడ్డి వివరించారు.




